వైసీపీ హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి పీఏ, కల్తీనెయ్యి సరఫరా కేసులో నిందితుడు కె.చిన్న అప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా సమకూరిన ఆదాయం రూ.65 లక్షలు. కానీ దిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంకు బ్రాంచ్‌లో అతని పేరిట ఉన్న ఖాతాలో ఆ ఐదేళ్లలో ఏకంగా రూ.4.69 కోట్లు జమైంది. అందులో రూ.4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించేసుకున్నారు. ప్రస్తుతం చిన్న అప్పన్న ఖాతాలో క్లోజింగ్ బ్యాలెన్స్ రూ.4.98 లక్షలే మిగిలింది’ అని సిట్ గుర్తించింది. అతని ఖాతాల్లో రూ.4.69 కోట్లు ఎక్కడినుంచి జమయ్యాయి? అంత భారీ మొత్తాలు ఎందుకు వచ్చినట్లు? ఆ సొమ్మును ఏ ఖాతాలకు బదిలీ చేశారనే కోణంలో కీలక వివరాలు రాబట్టిన సిట్.. ఇదంతా కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్న అప్పన్న ఖాతా నుంచి ‘అంతిమ లబ్ధిదారుకు’ చేరిందని గుర్తించింది.

The SIT investigation has uncovered shocking financial irregularities involving K. Chinna Appanna, the personal assistant to former TTD Chairman Y.V. Subba Reddy during the YSRCP regime

#YVSubbaReddy #ChinnaAppanna #TTDGheeScam #TTDLaddu #TirumalaLaddu #SITInvestigation #YSRCP #AndhraPradesh #CorruptionCase #TTD #OneindiaTelugu #APPolitics #PoliticalNews #YSRCPScam

Also Read

లడ్డూ కల్తీ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్ గా ధర్మారెడ్డి..! తెరపైకి వాళ్లు..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tirumala-laddu-adulteration-row-then-ex-eo-dharma-reddy-turns-as-apporover-and-revealed-big-names-460019.html?ref=DMDesc

'కల్తీ నెయ్యి'లో సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం, ఇదీ జరిగిందీ- హైకోర్టులో సిట్..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/sit-suspects-yv-subba-reddy-role-in-adulterated-ghee-case-files-counter-in-high-court-459507.html?ref=DMDesc

పార్లమెంట్ హౌస్ లో మెరిసిన మిథున్ రెడ్డి- ఎల్లుండి సరెండర్.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/peddireddy-mithun-reddy-cast-his-vote-for-the-vice-presidential-election-451191.html?ref=DMDesc